దోస పంట లో పక్షి కన్ను తెగులు నివారణ:

ఈ  తెగులు ఆకుపైన నీటిలో  నానిపెట్టు ఉన్న మచ్చలు ఏర్పడడంతో మొదలు అయి తర్వాత పసుపు గుండ్రపు  చుక్కలుగా మారతాయి క్రమ క్రమంగా గోధుమ రంగు లేదా నలుపు రంగులోకి మారుతాయి.ఈ మచ్చలు కాండం పైన కూడా గమనించవచ్చు .మొక్క ఎదుగుతున్న సమయంలో నాళాల కణజాలాన్ని గట్టిగా చుట్టిముట్టి కాండం మరియు తీగెలు ఎండిపోయేటట్లు చేస్తాయి.

ఈ మచ్చలు  6 నుండి 13  మిల్లిమీటర్ల వరకు ఉండి  6 మిల్లిమీటర్ల లోతు  ఉంటాయి.తేమ ఉన్నపుడు ఈ మచ్చల మధ్యలో ఉన్న నల్లని ప్రాంతం జిలటనుస్   సాల్మన్ రంగులో ఉన్న బీజాంషాలతో కనపడుతుంది. ఈ మచ్చలు పండ్లపైన  పెద్ద పరిమాణంలో గుండ్రని ,నల్లని మరియు నొక్కినట్టు ఉన్నట్టుగా ఏర్పడుతాయి.గులాబీ రంగులో ఉండే కాంకేర్లు ఇ తెగులు యొక్క ముఖ్య లక్షణాలు.

   

ముఖ్య కారణములు:

గ్లోమెర్ల  లాగేనరియుమ్ అనే ఫంగస్ వలన ఆకులూ మరియు పండ్ల పైన ఈ లక్షణాలు ఏర్పడతాయి.ఇవి ముందు పంట అవశేషాలతో లేదా దోస విత్తనాల ద్వారా సంక్రమిస్తుంది.వసంత ఋతువు లో వాతావరణం తేమగా ఉన్నపుడు ఈ ఫంగస్ గాలిలోకి బీజాంషాలను విడుదల చేస్తోంది.  ఇవి నేలకు దగ్గరగా  ఉన్న తీగలు మరియు ఆకులకు వ్యాధిని వ్యాపిస్తాయి. అధిక తేమ ,ఆకులపైన తడి మరియు అధిక ఉష్ణోగ్రతలు అత్యంత అనుకూలం.

నివారణ:

  • రోగ నిరోధక రకాలను ఎంచుకోవాలి.
  • పంట మార్పిడి చాల ఉపయోగకరం
  • పంట చివర్లో పండ్లు మరియు తీగల కింది దున్ని మంచిపారిశుధ్య సౌకర్యం ఏర్పాటు చేయాలి

ఉదయం సమయం లో నీరు పెట్టి సాయంత్రం మంచు కురవడానికి  ముందు ఆకులూ ఆరిపోయేటట్టు చూసుకోవాలి

రసాయన నియంత్రణ :

DHANUKA HEXADHAN FUNGICIDE  2 మిల్లి /లీ నీటిలో (లేదా) kavach fungiicde-1.5-2 మిల్లి /లీ నీటిలో. కలిపి పిచికారీ చేయడం వలన తీవ్రత తగ్గించవచ్చు .

  

Created by

Shirisha Rudraraju

Subject Matter Expert

BigHaat Agro PVT.

___________________________________________________________

For more information kindly call on 8050797979 or give missed call on 180030002434 during office hours 10 AM to 5 PM

_________________________________________________________

Disclaimer: The performance of the product (s) is subject to usage as per manufacturer guidelines. Read enclosed leaflet of the product(s) carefully before use. The use of this product(s)/ information is at the discretion of user.

 


Leave a comment

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.


Explore more

Share this