మిర్చి పంటపై బూడిద తెగులు (పౌడెరి మిల్డివ్) వ్యాధి సమర్థ నివారణ

  Powdery mildew disease in chilli

 

మిర్చి పంటలో వినాశకరమైన వ్యాధిలలో  బూడిద వ్యాధి(పౌడరీ మిల్డ్యూ)  ఒక్క ప్రధాన తెగులు. మిర్చి పంటలో బూడిద తెగులు లెవీలులా టౌరికా అని పేరున్న శిలింద్రతో వస్తుంది.

బూడిద తెగులు(పౌడెరి మిల్డివ్) లక్షణాలు

ఆకుల ఉపరితలం మీద లేత పచ్చ రంగు నుండి ముదురు గోధుమ రంగు గాయాల మచ్చల రూపంలో ఈ లక్షణాలు మొదలవుతాయి. ఆకుల కింది భాగంలో కూడా ఈ మచ్చలు కనిపించవచ్చు. అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు, ఆకుల కింది భాగంలో చిక్కటి తెల్లటి పొడి లాంటి బూజు పెరుగుదల కారణంగా ఆకులు వికృతంగా మారుతాయి. ఆ తర్వాత, ఆకుల పైభాగంలోకి కూడా ఈ బూజు వ్యాపిస్తుంది. చివరకు మొత్తం ఆకులు బూజుతో నిండిపోయి, చనిపోయినప్పటికీ, కొమ్మలకు అంటుకునే ఉంటాయి.

 

  Powdery mildew disease in chilli leaves

ఈ తెగుల లక్షణాలు కాయలు లేదా కాండాలు, కొమ్మల మీద కనిపించవు. అయితే, ఆకులు రాలిపోవడం వల్ల ఇవి కూడా ఎండిపోతాయి.ఆకులు రాలిపోవడం వల్ల కిరణజన్యసంయోగ క్రియ తగ్గిపోయి, చివరకు పంట దిగుబడి 50% వరకు తగ్గిపోతుంది. కాయల నాణ్యత కూడా తగ్గిపోతుంది. తెగులు సోకిన మొక్కలకు కాసిన కాయలకు పరిమళం ఉండదు, రుచి కూడా తక్కువగా ఉంటుంది. 

 

   Powdery mildew disease in chilli crop

బూడిద తెగులు రసాయన నియంత్రణ

లూనా ఎక్స్పీరియన్స్  1 మిలి / లి లేదా  మెరివోన్  0.35 మిలి / లి లేదా నీసోడియం  0. 6 -  1 మిలి / లి లేదా ఎర్గాన్ 0. 4 - 0. 6 గ్రామ్  / లి  లేదా అమిస్టార్  టాప్  0. 5 మిలి / లి నీటీలో కలిపి మిర్చి మొక్కలు పైన పిచికారీ చెయ్యాలి .

 

 Chemical control of Powdery mildew in chilli

 

ఇంకా బూడిద తెగులు నివారణకు రసాయన మందులు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

 

బూడిద తెగులు జీవి (బయోలాజికల్) నియంత్రణ 

వేదజ్ఞా కానోఫీ 4 మిలి / లి లేదా ఎలిక్సిర్ 3 మిలి/లి లేదా మల్టీప్లెక్స్ నిసర్గ 10 గ్రామ్  / లి  లేదా ఖుషి సూర్యనుండి   2  మిలి/ లి  లేదా డిఆర్ బాక్టోస్ ఎంపీలో - 2. 5 మిలి/లి నీటీలో కలిపి మిర్చి మొక్కలు పైన పిచికారీ  చెయ్యాలి .

 

 Biological control of Powdery mildew in chilli

 

ఇంకా బూడిద తెగులు నివారణకు జీవి (బయోలాజికల్) నియంత్రణ  మందులు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

 

బూడిద తెగులు నిరోధక చర్యలు

  • ఆతిధేయిలుగా ఉండే కలుపు మొక్కలను క్రమం తప్పకుండా నియంత్రించాలి.
    • మొక్కలు దట్టంగా లేకుండా చూడాలి. చక్కగా గాలి, వెలుతురు వెళ్లేందుకు వీలుగా మొక్కల మధ్య తగినంత దూరం ఉండాలి.
    • అవసరానికి మించి నత్రజని ఎరువులు వేయకూడదు, ఎందుకంటే, ఎక్కువ పచ్చదనంతో ఉండే ఆకులు తెగుల వ్యాప్తికి అనువుగా మారుతాయి.
    • మొక్కలకు అవసరమైనంత నీరు అందేలా చూడాలి. లేకపోతే, నీటి ఎద్దడి అనేది తెగులకు అనువైన పరిస్థితిగా మారుతుంది.
    • పొలంలోని చెత్తను సేకరించి తగలబెట్టేయాలి లేదా పూడ్చిపెట్టాలి.
    • పంటలు ఒకదానికొకటి తాకకుండా చూడాలి. లేదంటే, ఎదిగిన పంటల్లోని తెగులు కొత్తగా వేసిన పంటకు వ్యాపించే అవకాశం ఉంది.
    • పంట మార్పిడి చేయడం, దుంప పంటలు లేదా క్యాబేజీ కుటుంబానికి చెందిన ఆతిధేయిలు కాని పంటలు వేయడం చేయాలి.
    • తక్కువ కాంతి, ఎక్కువ తేమ మరియు మధ్యరకం ఉష్ణోగ్రత లాంటివి ఈ శిలీంధ్రాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
    • ఈ తెగుల కారకాలు కలుపు మొక్కలు లేదా ఆతిధేయి పంటల మీద దీర్ఘకాలం ఉండగలవు.
    • ఆరోగ్యంగా ఉండే లేత మొక్కల కంటే, ముదిరిన మొక్కలకు తెగులు సోకే ప్రమాదం ఎక్కువ.

                                                        &&&

                            

For more information kindly call on 8050797979 or give missed call on 180030002434 during office hours 10 AM to 5 PM

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

Disclaimer: The performance of the product(s) is subject to usage as per manufacturer guidelines. Read enclosed leaflet of the product(s) carefully before use. The use of this product(s) /information is at the discretion of user.

 


Leave a comment

This site is protected by hCaptcha and the hCaptcha Privacy Policy and Terms of Service apply.


Explore more

Share this