వైరస్ ముక్త మిర్చి మొక్కల తయారు!

      Chilli virus diseases

 గుబ్బ, ఆకు ముడుత, బొబ్బర మరియు జెమిని వైరస్ అనే పేరు మిర్చి పండించే రైతులకి నిదుర లేకుండా  చేస్తుంది. మిర్చి పంటని జెమిని వైరస్ కాకుండా  మొజాయిక్ వైరస్ మరియు టోస్పో [టొమాటో స్పాటెడ్ విల్ట్ వైరస్ TOSPO] దాడి చేయవచ్చు.

             TOSPO virus infection on Chilli

ఈ ప్రాణాంతక వైరస్  వ్యాదులనుండి మిర్చి పంటలను రక్షించడానికి రైతులు అనుసరించాల్సిన ఏకైక మంత్రం నివారణ కంటే నిరోధించడం ఉత్తమం.

అన్ని రకాల పంటలలో వైరస్ వ్యాధులు మొక్క నుండి మొక్కకు వ్యాపిస్తూ నష్టం కలుగుతుంది. వైరస్ వ్యాధులు రసం పీల్చే కీటకాల ఆక్రమణ సహాయంతో మొక్కలనుండి. 

   Plant viruses

మొక్కలకు వ్యాపిస్తుంది.ఈ  వ్యాధులు, పంట ఏ దశలోనైన దాడి చేయవచ్చు, కానీ మొక్కలు  25 రోజుల వయస్సు లోపు పెరుగుతున్న దశలో  అత్యంత వేగంగా మరియు సులువుగా వ్యాప్తించ గలవు.

      Sucking pests infestations on Chilli crop which may transfers the viral diseases

ఈ వయసులో మొక్కల ఆకుల భాగాలు చాల మృదువుగా మరియు రసవంతముగా  ఉండటం వల్ల తెల్ల దోమ, తామర పురుగులు , పేను బంక  మరియు ఇతర రసం పీల్చే కీటకాలు  చాలా ఇష్టపడతాయి.

   Chilli nursery

ఈ దశలో మొక్కలను ఈ  కీటకాల నుండి రక్షించకపొతే మిర్చి పంట పై  వైరస్ వ్యాధుల దాడి  ఖచిత్తం. 

మిర్చి పండించే రైతులు ఈ  దశని, అంటే (నర్సరీ దశ) చాల నిర్లక్షంగా నిర్వహిస్తున్నారు, దీని కారణంగా  మిర్చి పంటలలో  ఎక్కువ నష్ట పరిచే వైరస్ వ్యాధులని సమర్ధవంతంగా నివారించలేకపోతున్నారు. ఎలాంటి కిటనాశకాలు, మందలు  ఉపయోగించినా ఎలాంటి ప్రయోజనం లేక పొగా  రైతులు ఎక్కువ నష్ట పోతున్నారు.

             Insecticides

అంటే మిర్చి పంటగాని, టమాటో పంటగాని, తీగ జాతి పంటలు కానీ వైరస్ వ్యాధి దాడి చెయ్యక ముందే అరికడితే పంట నష్టాన్ని తగ్గించవచ్చు. అందుకని మిర్చి, టమాటో మరియు తీగ జాతి పంటల సాగు పద్దతి అంటే నెట్ హౌస్ (నర్సరీ) లో,  పాలీహౌస్ లలో విత్తనాలు నాటితె లేత మొక్కలను రసం పీల్చే కీటకాల దాడినుండి రక్షించవచ్చు.

   Vegetable nursery

రైతులు నెట్ హౌస్ , పాలీహౌసు ల అనుకూలం లేకపోతే మట్టిలో విత్తనాలు నాటు చేసిన పొలం భాగానికి నెట్(మెస్) అంటే రసం పీల్చే పురుగుల దాడి నుండి లేత మొక్కలని రక్షించు గల మెస్ తో కప్పి అరికట్టవచ్చు.

     Nursery raising of chilli crops

మిర్చి , టమాటో లేదా ఎలాంటి మొక్కలను అయిన నర్సరీ లో పెంచినట్లైతే , పొలంలో నాటు చేసే  ముందు హార్డెనింగ్ చెయ్యాలి, అంటే నాటు చేసే 2 - 3 రోజులు ముందు కొన్ని గంటల సమయం ఎండలో ఉంచి, కొన్నీ రోజులు నీరు తగ్గించడం వల్ల మొక్కలు ధృడంగా పెరుగుతాయి మరియు వైరస్, ఇతర వ్యాధుల నుంచి సహన శక్తి పొందుతాయి.

                                 *******

K SANJEEVA REDDY,

Lead Agronomist, BigHaat.

 ----------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం కోసం  ఆఫీసు వేళల్లో [ఉదయం10 AM నుండి 5 PM] వరకు 8050797979 నెంబర్ కు వాట్సాప్ ద్వారా సంప్రదించండి లేదా  180030002434 కు  మిస్డ్ కాల్ ఇవ్వండి!

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

 

Disclaimer: The performance of the product (s) is subject to usage as per manufacturer guidelines. Read enclosed leaflet of the product(s) carefully before use. The use of this product(s)/ information is at the discretion of user.


Leave a comment

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.


Explore more

Share this