బి.టి. పత్తి పంట ప్రముఖ కీటకాలు మరియు నిర్వహణ

2 comments

     Cotton crop insects

భారతదేశంలో ప్రధాన వాణిజ్య పంటలలో పత్తి కూడా ఒక్క ముఖ్యమైన పంట. పత్తి పంట  వివిధ రకాల తెగుళ్ళకు మరియు కీటకాలకు గురవుతుంది. పచ్చ దోమ, (జాసిడ్స్), తామర పురుగులు [త్రిప్స్], పెను బంక {అఫిడ్స), తెల్ల దోమ కీటకాలు మరియు కాయ తొలచు పురుగుల  పత్తి  పంటను దాడి చేయవచ్చు.

      Cotton crop insects

పత్తి పంటలో కాయ తొలుచు పురుగులు (అమెరికన్ బోల్వర్మ్) దాడి వల్ల  40 -50% పంట నష్టం సంభవిచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. బోల్వర్మ్ పురుగులు పురుగుమందుల పైన ఎక్కువ రోగనిరోధక శక్తి కలిగి ఉండటం వల్ల పత్తి పంటలో పురుగుల నిర్వహణ  సవాలుగా మారింది. పత్తి పంటలో బోల్వర్మ్  కీటకాల నివారించుటకు శాస్త్రీయ పరిశోధనలో శాస్త్రవేత్తలు  ట్రాన్స్జెనిక్ కాటన్ (పత్తి) హైబ్రిడ్లను అభివృద్ధి చేసారూ.

     Bt Cotton

అలా తయారు చేసిన పత్తి రకాలను  బిటి కాటన్ అని పిలుస్తారు. బిటి కాటన్(పత్తి) హైబ్రిడ్ మొక్కలు కాయ తొలుచు పురుగుల (అమెరికన్ బోల్వర్మ్)పై మంచి నియంత్రణ ఉంటుంది మరియు ఈ బిటి కాటన్(పత్తి) హైబ్రిడ్ మొక్కలు పై  కాయ తొలుచు పురుగుల (అమెరికన్ బోల్వర్మ్) నియంత్రించడానికి పత్తి పంటపై ఎలాంటి పురుగుమందులను ఉపయోగించాల్సిన అవసరం లేదు.

పత్తి పంటలో ప్రధాన కీటకాలు

  1. అమెరికన్ పత్తి కాయ తొలుచు పురుగు (హెలికోవర్పా ఆర్మిజెరా)

      American Bollworm on cotton

అమెరికన్ పత్తి కాయ తొలుచు పురుగులు పత్తి కాయలకు రంద్రాలు చేసి లోపలి కణజాలను, పెరుగుతున్న విత్తనాలను తిని నాశనం చేస్తాయి. పురుగులు దాడి చేసినప్పుడు  వాటి  తల కాయలోపల మరియు శరీరం వెలుపల ఉంటుంది అలాగె కాయల పై పురుగుల మల గుళికలు కనుపడతాయి.

      American Bollworms on cotton

అమెరికన్ పత్తి కాయ తొలుచు పురుగు (హెలికోవర్పా ఆర్మిజెరా)లు ప్రతి మొక్కలో   30 - 40 కాయలను దాడి చేయ గలవు  కానీ బి టి పత్తి  రకాలలో అమెరికన్ పత్తి కాయ తొలుచు పురుగు (హెలికోవర్పా ఆర్మిజెరా)ల దాడి చాలా తక్కువుగా ఉంటది. బీటి పత్తి రకాలు గులాబి రంగు కాయ తొలుచు పురుగులను అరకట్టలేవు మరియు ఈ కాయ తొలుచు పురుగులు బీటి పత్తి రకాలను బాగానె దాడి చేయవచ్చు.

2. గులాబి రంగు కాయ తొలుచు పురుగు (పెక్టినోఫోరా గాసిపెల్లె)

      Pink boll worms

పత్తి పంటలో గులాబి రంగు కాయ తొలుచు పురుగుల దాడి యొక్క లక్షణం  అమెరికన్ పత్తి కాయ తొలుచు పురుగు దాడి మాదిరిగానే ఉంటుంది. గులాబి రంగు కాయ తొలుచు పురుగు పుష్పగుచ్ఛము చీలమండపై దాడి చేస్తుంది. పురుగులు పత్తి కాయ, కాయల కణజాలను మరియు విత్తనాలను తిని నాశనం చేస్తాయి. కాయలలో ప్రవేశ రంధ్రాలు పురుగుల మల గుళికలతో కప్పబడి ఉంటాయి.

     Pink Bollworm on cotton

గులాబి రంగు కాయ తొలుచు పురుగుదాడి చేస్తున్న పత్తి కాయలు, ముదురక ముందే రాలి పోయే అవకాశాలు ఉంటాయి.

ఆకర్షక పంటతో గులాబి రంగు కాయ తొలుచు పురుగుల నిర్వహణ:బీటి పత్తి పంటలో గులాబి రంగు కాయ తొలుచు పురుగుల దాడిని అరికట్టడానికి, సాధారణ పత్తి నాన్-బిటి పత్తి అంటే బి టి రకాలు కాని రకాల విత్తనాలను, బి టి విత్తనాలు నాటే పొలం చుట్టూ, 5 వరసలు నాటాలి.

   Trap crop

ఆలా నాటడం వలన  గులాబి రంగు కాయ తొలుచు పురుగుల దాడి సాధారణ పత్తి నాన్-బిటి పత్తి మొక్కల పై మాత్రమే ఎక్కువుగా ఉంటది మరియు బి టి హైబ్రిడ్ రకాల పై దాడి చాలా తక్కువుగా ఉంటది.

 3. పొగాకు పురుగు (స్పోడోప్టెరా లిటురా )

  Tobacco caterpillar on Cotton

పొగాకు పురుగు (స్పోడోప్టెరా లిటురా చిమ్మటలు పత్తి మొక్కల ఆకులపై గుడ్లు పెడతాయి, చిన్న పురుగులు బయటకు వచ్చి ఆకుల పై  దాడి చేసి తింటూ ఆకులను జల్లెడ లాగ చేస్తాయి.  పొగాకు పురుగుల దాడి తీవ్రంగా ఉన్నప్పుడు మొక్కల ఆకులు మొత్తం అన్నీ రాలిపోవచ్చు . స్పోడోప్టెరా జాతి నుండి  మరొక పురుగు రకం, స్పోడోప్టెరా ఫ్రూజిపెర్డా సాధారణ ఇతర స్పోడోప్టెరా జాతి రకాల కంటే ఎక్కువు నష్టాన్ని కలిగిచ్చ కలదు.

  Tobacco caterpillars on Cotton

స్పోడోప్టెరా ఫ్రూజిపెర్డా పొగాకు పురుగు రకం రాత్రి పూట దాడి చేస్తుంది మరియు ఇది చిన్న మొలకెత్తిన పత్తి మొక్కలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది.

4. మెరుగు మచ్చ కాయ తొలుచు పురుగు (ఇరియాస్ ఇన్సులానా మరియు ఇరియాస్ విటె)

  Shiny spotted boll worm

మెరుగు చుక్క కాయ తొలుచు పురుగులు పత్తి కాయలు , పువ్వులు, కొన్నిసార్లు రెమ్మలపై నేరుగా వ్యాపిస్తాయి. ఈ మెరుగు చుక్క పురుగులు మొక్కల పెరుగుదల దశలో పత్తి మొక్కల కొమ్మలను దెబ్బతీస్తాయి, దీని వలన మొక్క యొక్క రెమ్మలు ఎండిపోయి చనిపోతాయి.

  Shiny spotted bollworm

మెరుగు చుక్క కాయ తొలుచు పురుగులు పత్తి కాయల పై దాడి చేసినప్పుడు కాయలకు రంధ్రాలు ఏర్పడతాయి, కాయలు కుళ్లిపోయే అవకాశాలు ఉంటాయి.

కాయ తొలుచు పురుగుల రసాయన నియంత్రణ

బి టి పత్తి రకాల సాగులో, అమెరికన్ పత్తి కాయ తొలుచు పురుగులు కాకుండా గులాబి రంగు కాయ తొలుచు పురుగు, పొగాకు పురుగు, మెరుగు మచ్చ కాయ తొలుచు పురుగు కీటకాలను ఈ క్రింది రసాయనాలను ఉపయోగించడం ద్వారా సమర్థవంతంగా నియంత్రించవచ్చు.

 

క్ర. సం.

సాంకేతిక పేరు

వాణిజ్య పేరు

1

ఎమామెక్టిన్ బెంజోయేట్

ఫోక్లేమ్, స్టార్‌క్లైమ్, EM-1, రిలాన్, ఎమా గోల్డ్, బయోక్లేమ్., మొదలైనవి.

2

స్పినోసాడ్

ట్రేసర్, స్ప్లింటర్

3

ప్రొఫెనోపాజ్ + సైపర్‌మెథ్రిన్

రాకెట్, ప్రోఫెక్స్ సూపర్, పాలిట్రిన్

4

క్లోరోపైరిఫోస్ + సైఫర్ మెథ్రిన్

హమ్లా, కోరాండా, డెర్మెట్, ప్రిడేటర్.

5

నోవలురాన్ + ఇండోక్సాకార్బ్

ప్లితోరా, రిమ్ ఆన్ ...

6

క్లోరాంట్రానిలిప్రోల్

కోరాజెన్, ఆంప్లిగో.

7

ఫ్లూబెండియామైడ్

ఫేమ్, ఫ్లట్టన్, బెల్ట్ ఎక్స్‌పర్ట్, టకుమి,

8

బాసిల్లస్ తురింగియెన్సిస్ (సేంద్రీయ)

డెల్ఫిన్

 

    Management of boll worms complex on Cotton

5. పచ్చ దోమ - జాసిడ్స్ (అమ్రాస్కా బిగుతులా)

  Jassid or leaf hoppers in cotton

పచ్చ దోమ - జాసిడ్స్ పత్తి పంటలో ఆకుల రసాన్ని పీలుస్తాయి, ఆకులు క్రింద వైపు తిరుగి పసుపు రంగులోకి మారుతాయి, తీవ్ర దాడి ఉన్నప్పుడు ఆకులు ఇటుక రంగులోకి  మారి పొడిగా అవుతాయి మరియు రాలిపోతాయి .

6.పెను బంక - కాటన్ అఫిడ్స్ (ఆఫీస్ గాసిప్)

  Aphid on cotton

పెను బంక అఫిడ్స్ పత్తి పంటలో లేత ఆకులు మరియు కొమ్మల పై దాడి చేస్తాయి అవి ఆకు రసాన్ని పీల్చుతూ నష్టం చేయగలవు. దాడి కి గురైన మొక్కలు మందగిస్తాయి మరియు ఆకులు పడిపోవచ్చు. పెను బంక దాడి ఉన్నప్పుడు మొక్కల ఆకులపై తీపి జిగురును స్రవిస్తాయి, తీపి స్రవాన్ని తినడానికి చీమలూ మరియు  శిలింద్ర (ఫంగస్) కూడా వస్తుంది.

7. తామర పురుగులు (త్రిప్స్ టాబాసి).

తామర పురుగు కీటకాలు పత్తి ఆకుల రసాన్ని గ్రహించి, ఆకులను పసుపు లేత ఆకుపచ్చగా మారుస్తాయి. చిన్న ఆకులు తక్కువ పరిమాణంతో పైకి తిరుగుతాయి మరియు ఆకు యొక్క అంచులు గోధుమ రంగులోకి వస్తాయి మరియు తీవ్రమైన దాడి ఉన్నప్పుడు  పత్తి మొక్కలు కాలిపోతాయి.

   Thrips on cotton

మొత్తానికి పెను పెను బంక దాడి వల్ల ఆకులపై నల్ల బూజు తయారు అవ్వుతుంది, కిరణజన్య సంయోగక్రియ (ఫోటోసిన్తిసిస్) తగ్గి పోతుంది, పత్తి మొక్కలలో దిగుబడి తగ్గొచ్చు.

 8. ఎరపు పత్తి చిత్తడి (బీటిల్స్ ): (డైడెర్కస్ సింగులాటుసి)

ఎరపు పత్తి చిత్తడి వయోజన కీటక  మరియు వయోజన పూర్వ కీటక దశ  విత్తనాలను తినవచ్చు మరియు వృద్దిస్తున్న విత్తనాలను తినవచ్చు. చిత్తడి దాడివల్ల పత్తి కాయలు ముదుఋ అవ్వక  పత్తి నూలు నాణ్యతను తగ్గిస్తుంది. ఎరుపు పత్తి చిత్తడి కీటకాల దడి కారణంగా పత్తి కాయలో నూలులో శిలీంధ్రాలు లేదా బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. 

  Red cotton beetles

పత్తి నూలు ఎరుపుగా మారుతుంది మరియు కాయలు నల్లగా మారవచ్చు.

పైన చర్చించిన రసం పీల్చే కీటకాలు పత్తి పంటను నష్టం కలిగిస్తాయి. క్రింద సూచించిన పురుగుమందులను సరైన సమయంలో సరైన పద్దతిలో ఉపయోగం చేస్తే పత్తి పంటలను రసం పీల్చే కీటకాల నుండి కాపాడవచ్చు.

క్ర. సం.

సాంకేతిక పేరు

వాణిజ్య పేరు

1

అసిఫేట్

హంక్, అసటోఫ్, లాన్సర్ గోల్డ్,

2

ఇమిడాక్లోప్రిడ్

కాన్ఫిడోర్, ఇమిదాస్టార్, ప్యూర్ ఇమిడా

3

వేప నూనె  50000 పి పి ఎం

ఎకోటిన్

4

ఫైప్రోనిల్

రీజెంట్, షిన్జిన్ ప్లస్

4

స్పినోసాడ్

ట్రేసర్

5

థియోమెథోక్సం

ఆక్టారా, కేపర్, మాగ్జిమా

6

టోల్ఫెన్పిరాడ్

కీఫెన్

 

Controlling sucking insects in cotton

 

9. తెల్ల దోమ (బెమిసియా టాబాసి)

తెల్ల దోమ దాడి పత్తి పంట పైన కూడా ప్రభావితమవుతుంది, తెల్ల దోమలు ఆకుల రసాన్ని గ్రహిస్తాయి మరియు పెను బంక దాడిలో తీపి జిగురును విడుదల చేసినట్లే,  తెల్ల దోమలూ  మొక్కల ఆకులపై తీపి జిగురును స్రవిస్తాయి తీపి స్రవాన్ని తినడానికి చీమలూ వస్తాయి శిలింద్ర (ఫంగస్) కూడా వస్తుంది.

  Whiteflies on Cotton

తెల్ల దోమ దాడి వల్ల ఆకులపై నల్ల బూజు తయారు అవ్వుతుంది, కిరణజన్య సంయోగక్రియ (ఫోటోసిన్తిసిస్) తగ్గి పోతుంది, పత్తి మొక్కలలో దిగుబడి తగ్గొచ్చు. తెల్ల దోమలు పత్తి పంటలలో వైరస్ తెగుళ్లను వ్యాపించే అవకాశాలు ఎక్కువుగా ఉంటుంది.

తెల్ల దోమ నిర్వహణ:

క్ర. సం.

సాంకేతిక పేరు

వాణిజ్య పేరు

1

ఎసిటామిప్రైడ్ 20% sp

ఎక్కా, ప్రైమ్, ప్రైమ్ గోల్డ్

2

స్పిరోటెట్రామాట్ + ఇమిడాక్లోప్రిడ్

మూవెంటో ఎనర్జీ

3

వేప నూనె  50000 పి పి ఎం

ఎకోటిన్

4

అసిఫేట్ + బుపెర్ఫెజిన్  

ఓడిస్ 

5

ఇన్స్కాలిస్

సెఫినా

6

డయాఫెంటురాన్

బిలియన్, పెగసాస్, పేజర్, పిడూన్

7

పైమెట్రోజైన్ 50%

చెస్,అప్ప్లై

 

    Management of whiteflies on Cotton

10. పిండి నల్లి (మీలీ బగ్స్):

పిండి  నల్లి పురుగులు పత్తిలో రసం పీల్చే రకం పురుగు. పిండి నల్లి పురుగులు ఆకుల మీద మరియు క్రింద సమూహంలాగా కనుబడతాయి.    పిండి నల్లి దాడి చేసున్న పత్తి మొక్కలు బలహీనపడి, నిర్వహించకపోతే దిగుబడి తగ్గుతుంది. పెను బంక మరియు తెల్ల దోమల దాడిలో తీపి జిగురును విడుదల చేసినట్లే,  పిండినల్లి దాడిలో కూడా పిండినల్లి మొక్కల ఆకులపై తీపి జిగురును స్రవిస్తాయి తీపి స్రవాన్ని తినడానికి చీమలూ వస్తాయి శిలింద్ర (ఫంగస్) కూడా వస్తుంది.

  Mealy bugs on Cotton

పిండినల్లి దాడి వల్ల ఆకులపై నల్ల బూజు తయారు అవ్వుతుంది, కిరణజన్య సంయోగక్రియ (ఫోటోసిన్తిసిస్) తగ్గి పోతుంది, పత్తి మొక్కలలో దిగుబడి తగ్గొచ్చు.

 పిండి నల్లి  పురుగుల నిర్వహణ:

క్ర. సం.

సాంకేతిక పేరు

వాణిజ్య పేరు

1

డైమెథోయేట్

టాఫ్గోర్

2

స్పిరోటెట్రామాట్ + ఇమిడాక్లోప్రిడ్

మూవెంటో ఎనర్జీ

3

పైమెట్రోజైన్ 50%

చెస్,అప్ప్లై

4

థియోమెథోక్సం

ఆక్టారా, కేపర్, మాగ్జిమా

5

ప్రొఫెనోపాజ్ + సైపర్మెథ్రిన్

రాకెట్, ప్రోఫెక్స్ సూపర్, పాలిట్రిన్

 

   Management of mealy bugs on Cotton

పత్తిలో లేదా ఏదైనా పంటలలో కలుపు మొక్కలు ఎల్లప్పుడూ హానికరమైన తెగుళ్ళకు ప్రత్యామ్నాయ (ఆల్టర్నేట్ ) పంటగా ఉంటాయి  మరియు ప్రధాన పంటలను దెబ్బతీయటంలో సాయపడుతాయి.  పొలంలో సరైన పరిశుభ్రత, కలుపు రహిత నిర్వహణ చేసినట్లైతే అన్ని రకాల తెగుళ్ల బాధ తక్కువుగా ఉంటుంది. 

11. పత్తి పంట పై నల్లి (ఎరుపు నల్లి)

ఎరుపు నల్లి (రెడ్  స్పైడర్ మైట్స్ ) [టెట్రానిచాడ్ సిన్నబరినస్], పసుపు రంగు నల్లి / బ్రాడ్ మైట్స్  : [పాలిఫాగోటార్సోనెమస్ లాటస్] మరియు  [అసిరియా గాసిపి] సాధారణంగా మూడు రకాల నల్లి తెగుళ్లు పత్తి పంటను దాడి చేస్తాయి.  

    Red mites on Cotton crop

పత్తి పంట అభివృద్ధి యొక్క ప్రారంభ దశలలో, నల్లి  మొక్కలపై దాడి చేస్తాయి, సాధారణంగా ఎర్ర నల్లి సాలీడు శ్లేష్మంలో ఉండి పంట నష్టాన్ని చేస్తాయి మరియు సుపు రంగు నల్లి తెగుళ్లు  మొక్కల రసాన్ని పీలుస్తాయి, మొక్కల పెరుగుదల పువ్వు మరియు గింజను కుంగదీస్థాయి.

పత్తిలో నల్లి తెగుళ్ల నిర్వహణ

క్రసం.

సాంకేతిక పేరు

వాణిజ్య పేరు

1

అబామెక్టిన్

అబాసిన్

2

స్పిరోమెసిఫేన్

ఒబెరాన్

3

మూలిక సారం

రాయల్ క్లియర్ మైట్

4

ప్రొపార్గైట్

ఓమైట్

5

ఫెనాజోక్విన్

మెజిస్టర్

6

ఫెన్పైరాక్సిమీట్

పైరోమైట్

 

  Management of mites complex on Cotton

                               *************

మరింత సమాచారం కోసం కార్యాలయ సమయంలో 8050797979 కు కాల్ చేయండి లేదా 180030002434 కు మిస్డ్ కాల్ ఇవ్వండి. 8050797979 సంఖ్యకు వాట్సాప్ కూడా చేయవచ్చు.

____________________________________________

Disclaimer: The performance of the product (s) is subject to usage as per manufacturer guidelines. Read enclosed leaflet of the product(s) carefully before use. The use of this product(s)/ information is at the discretion of user.

 


2 comments


  • Mahesh

    పురుగు కాయ కయడం లేదు పువ్వు లరిపోతుంది


  • K.Naresh

    I am a famar


Leave a comment

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.


Explore more

Share this