మిర్చి పంటపై నల్ల తామర పరుగులు [వెస్ట్రన్ త్రిప్స్ / బ్లాక్ త్రిప్స్] నివారణకు పిచికారీ కీటనాశకాలు!
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మరియు కర్ణాటక ప్రాంతాల్లో యెర్ర మిరప(మిర్చి) కొన్ని జిల్లాల్లో పండిస్తారు. మిర్చి పంట కొన్ని రసం పీల్చే కీటకాల దాడికి గురి అవ్వుతుంది. తామర పురుగులు, పెను బంక, తెల్ల దోమ, పిండి నల్లి మరియు తెల్ల నల్లి( వెనక ముడుత) ఇవి మిర్చి పంటను ఎక్కువుగా భాద పెడతాయి.
ఇటీవల రోజుల్లో నల్ల తామర పరుగులు( వెస్ట్రన్ త్రిప్స్/ బ్లాక్ త్రిప్స్) ఫ్రాంక్లినియెల్లా ఆక్సిడెంటాలిస్ కీటకం మన మిర్చి పండిస్తున్న రైతులకు తలనొప్పిగా మారిపోయింది. నల్ల తామర పరుగులను నివారించడం మరియు నిర్వహణ చెయ్యడానికి రైతులు ఇంతకు ముందు దాడి చేసే తామర పురుగులను నివారించడానికి ఉపయోగించే మందులు వాడుతున్నారు కానీ నల్ల తామర పరుగులు నియంత్రణం అవ్వట్లేదు.
రైతులు నియంత్రణ చర్యలు సరిగ్గా చెయ్యకపోతే TOSPO వైరస్ మరియు ఇంపటైన్స్ నెక్రోటిక్ స్పాట్ వైరస్ వంటి చాలా తీవ్రమైన పంటల వైరస్ వ్యాధులను వ్యాపింపజేసే అవకాశాలు ఎక్కువుగా ఉంటది.
నల్ల తామర పరుగులు( వెస్ట్రన్ త్రిప్స్/ బ్లాక్ త్రిప్స్) తెగుళ్లను పూర్తిగా తగ్గించడానికి ప్రతి 5-6 రోజులకు వివిధ రకాల పురుగు మందులను పిచికారీ చేయవచ్చు.
1. డెలిగేట్ 1 మిలి/లీ + కార్టాప్ హైడ్రో క్లోరైడ్ 1.5 గ్రామ్/లీ కలిపి మిర్చి మొక్కల ఆకుల పైన పిచికారి చెయ్యాలి
2. సోలోమన్ 1 మిలి/లీ + పెగాసస్ 0.5 గ్రామ్/లీ కలిపి మిర్చి మొక్కల ఆకుల పైన పిచికారి చెయ్యాలి
3. మొవెంటో OD - 1.2 మిలి/లీ + ఇకోటిన్ 0.3 మిలి/లీ కలిపి మిర్చి మొక్కల ఆకుల పైన పిచికారి చెయ్యాలి
4. కీఫున్ 2 మిలి/లీ + ఆక్టారా 0.5 గ్రామ్/లీ కలిపి మిర్చి మొక్కల ఆకుల పైన పిచికారి చెయ్యాలి
5. ఫిప్రోనిల్ 1.5 మిలి/లీ + ఎసిఫేట్ 1.5 గ్రామ్/లీ కలిపి మిర్చి మొక్కల ఆకుల పైన పిచికారి చెయ్యాలి
ఇంతక ముందు మిర్చి మరియు కాప్సికం పంటలలో ప్రాణాంతకమైన నల్ల తామర పురుగులు వెస్ట్రన్ త్రిప్స్ (బ్లాక్ త్రిప్స్) దాడి నియంత్రణకు రైతులు పిచికారీ చేసి, ఫలితం కనిపించిన పురుగు మందుల కలయికలు.
మిర్చి పంటలో ప్రాణాంతకమైన నల్ల తామర పురుగులు వెస్ట్రన్ త్రిప్స్ (బ్లాక్ త్రిప్స్) దాడి నియంత్రణకు రైతులు నీలి రంగు జిగురు అట్టులు( Blue sticky traps) తోటలో కడుతున్నారు. దీని ద్వారా వెస్ట్రన్ త్రిప్స్ దాడి కొంత వరుకు నియంత్రణ అవ్వుతుంది.
&&&
For more information kindly call on 8050797979 or give missed call on 180030002434 during office hours 10 AM to 5 PM
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
Disclaimer: The performance of the product(s) is subject to usage as per manufacturer guidelines. Read enclosed leaflet of the product(s) carefully before use. The use of this product(s) /information is at the discretion of user.
Guarantee madhulu usefull Avataya
Leave a comment